రిలీజ్ డేట్ మార్చుకున్న ఫహాద్ సినిమా.. కొత్త డేట్ ఎప్పుడంటే..?

ఫహాద్ ఫాసిల్ హీరోగా కొత్త దర్శకుడు శశాంక్ ఏలేటి తెరకెక్కిస్తున్న ఫాంటసీ డ్రామా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. విచిత్రమైన శక్తులు ఉన్న ఒక చిన్నారితో సూరి (ఫహాద్ ఫాసిల్) సాగించే ప్రయాణం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ పతాకాలపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

గతంలో ఈ సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ, తాజాగా ఈ రిలీజ్ డేట్‌ను వాయిదా వేశారు. ఈ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2, 2026న థియేటర్లలోకి రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. కాలభైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version