ర‌జినీకాంత్ ‘కూలీ’లో మ‌రో విల‌క్ష‌ణ నటుడు..?

ర‌జినీకాంత్ ‘కూలీ’లో మ‌రో విల‌క్ష‌ణ నటుడు..?

Published on Jun 14, 2024 8:04 PM IST

త‌మిళ సూపర్ స్టార్ ర‌జినీకాంత్ ప్ర‌స్తుతం వ‌రుస‌గా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే ఆయ‌న ‘వెట్టాయ‌న్’ అనే సినిమాను చేస్తుండ‌గా, ద‌ర్శ‌కుడు లోకేశ్ క‌న‌గ‌రాజ్ తో క‌లిసి ‘కూలీ’ అనే సినిమాను కూడా చేయ‌నున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి సినీ స‌ర్కిల్స్ లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్క‌ర్లు కొడుతోంది.

లోకేశ్ క‌న‌గ‌రాజ్ తెర‌కెక్కించే ‘కూలీ’ మూవీలో మ‌రో విల‌క్ష‌ణ న‌టుడు ఫ‌హాద్ ఫాజిల్ కూడా న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. గతంలో లోకేశ్ క‌న‌గ‌రాజ్ తెర‌కెక్కించిన ‘విక్ర‌మ్’ మూవీలోనూ ఫ‌హాద్ న‌టించారు. ఇప్పుడు మ‌రోసారి ‘కూలీ’ సినిమాలో న‌టించేందుకు లోకేశ్ ఆయ‌న్ను ఒప్పంచిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ సినిమా షూటింగ్ ను త్వ‌ర‌లోనే ప్రారంభించాల‌ని చిత్ర యూనిట్ భావిస్తోంది. కాగా, ఈ సినిమాను 2025 వేస‌వి కానుక‌గా రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగ‌తా క్యాస్టింగ్ ను అతి త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు