వైరల్ : “పుష్ప” స్టైల్ లో కమల్ సినిమాని పూర్తి చేసిన ఫహద్ ఫాజిల్.!

Published on Mar 2, 2022 10:01 am IST

ప్రస్తుతం సినీ వర్గాల్లో విశ్వ నటుడు కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “విక్రమ్” కోసం మంచి హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఈ సినిమా భారీ ధరకు ఓటిటి మరియు శాటిలైట్ డీల్ ని ముగించుకోగా రీసెంట్ గా ఈ సినిమా దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ మరో బిగ్ అప్డేట్ ఇవ్వడం ఆసక్తిగా మారింది.

ఈ చిత్రం మొత్తాన్ని 110 రోజుల్లో తాము కంప్లీట్ చేశామని ఫైనల్ గా సినిమా ముగిసిపోయింది అని తన చిత్ర బృందం అందరికీ లోకేష్ థాంక్స్ చెప్తూ ఇంట్రెస్టింగ్ వీడియోని ఒకటి పెట్టాడు. ఈ సినిమాలో లాస్ట్ షాట్ గా ఫహద్ పై తీసి ముగించారు.

మరి ఈ షాట్ ముగించాక ఫహద్ తన లాస్ట్ భారీ హిట్ సినిమా “పుష్ప” లోని హిట్ డైలాగ్ ‘పార్టీ లేదా పుష్ప’ అంటూ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తో అడగడం ఆసక్తిగా మారిపోయింది. దీనితో ఈ ఫైనల్ షాట్ మంచి వైరల్ అవుతుంది. అయితే దీనితో ఈ సినిమాలో ఫహద్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నట్టు కూడా కన్ఫర్మ్ అయ్యిందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :