హైపర్ ఆదిపై ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.!

Published on Nov 9, 2021 7:15 am IST


తెలుగు బుల్లితెర పై ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే “జబర్దస్త్” కామెడీ షో కోసం అందరికీ తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా తెలుగు ప్రేక్షకుల ఆదరణతో దూసుకెళ్తున్న ఈ షో, టాలెంట్ ఉన్న అనేకమందికి మంచి గుర్తింపుని కూడా ఇచ్చింది. అలాంటి వారిలో కమెడియన్ హైపర్ ఆది కూడా ఒకరు.

అయితే ఆది రీసెంట్ గా చేసిన ఓ ఈవెంట్ లో చేసిన స్కిట్ పరంగా అతనిపై దాడి చేసేందుకు టాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ హీరో ఫ్యాన్స్ యత్నిస్తున్నారని ఇందులో సారాంశం. కొన్ని ఫేక్ వార్తలు ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్నాయి. అయితే దీనిపై సరైన వివరణ ఇప్పుడు తెలిసింది.

అసలు ఈ వైరల్ అవుతున్న ఫేక్ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం ఆది మాస్ మహారాజ్ రవితేజ “ధమాకా” లో ఒక రోల్ అలాగే ‘జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ అలాగే ‘ఢీ’ షోలలో బిజీగా ఉన్నాడు. సో తనపై ఇలా వైరల్ అవుతున్న ఈ తప్పుడు వార్తలు అన్నీ అవాస్తవం అని అందరికీ క్లారిటీ వచ్చినట్టే.

సంబంధిత సమాచారం :

More