హీరోల సినిమాలకు సంభందించి అప్పుడప్పుడు పుకార్లు రావడం మామూలు విషయమే. కానీ సోషల్ మీడియా వినియోగం పెరగడంతో ఆ పుకార్లను ఒక్కోసారి నిజమని నమ్మేసే పరిస్థితి వస్తోంది. తాజాగా హీరో నాని తన తర్వాతి సినిమను శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తాడని, అందులో సమంత హీరోయిన్ అని ఒక పాపులర్ నిర్మాణ సంస్థ పేరిట ఒక పోస్టర్ విడుదలైంది.
దాన్ని చూస్తే నిజంగా అది అఫీషియల్ పోస్టర్ అనే అనుకుంటారు. చాలామంది అనుకున్నారు కూడా. కానీ అది ఫేక్ న్యూస్. అది ఎవరో క్రియేట్ చేసిన ఫేక్ పోస్టర్. దీనిపై స్పందించిన దర్శకుడు శివ నిర్వాణ నా తర్వాతి సినిమా గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదు. త్వరలోనే నా సినిమా వివరాల్ని వెల్లడిస్తాను. ఫేక్ వార్తలను నమ్మకండి అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే ప్రస్తుతం నాని మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘వి’ అనే సినిమాలో నటిస్తుండగా, శివ నిర్వాణ విజయ్ దేవరకొండతో సినిమాను ప్లాన్ చేసుకుంటున్నారు.
