ఇంటర్వ్యూ : రాజ్ తరుణ్ – కుటుంభం అంతా కలిసి చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్టైనర్

4th, January 2018 - 08:22:21 PM

‘ఉయ్యాల జంపాల’ సినిమాతో రాజ్ త‌రుణ్‌కి తొలి అవ‌కాశం ఇచ్చిన అన్న‌పూర్ణ స్టూడియోస్ లో రాజ్ తరుణ్ నటించిన రెండో సినిమా రంగుల రాట్నం. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా రాజ్ తరుణ్ తో ఇంటర్వ్యూ …

రంగులరాట్నం సినిమా గురించి ?

కుటుంభం అంతా కలిసి చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ సినిమా. మదర్ సెంటిమేంట్ బాగా వర్క్ అవుట్ అయ్యింది. ఈ సంక్రాంతికి మా సినిమా థియేటర్స్ కు రాబోతోంది.

సినిమా నేపథ్యం ఏంటి ?

అందరికి కనెక్ట్ అయ్యే కథ ఇది. లవ్ స్టొరీ తో పాటు చిన్న చిన్న ఎమోషన్స్ ఈ సినిమాలో బాగా పండాయి.

మీ పాత్ర గురించి ?

ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి క్యారెక్టర్ నాది. భాద్యతలు తక్కువ ఉన్న పాత్ర ఇది. నా లుక్ ఈ సినిమాలో సహజంగా ఉంటుంది. అందరిలా సరదాగా కనిపిస్తాను.

అన్నపూర్ణ బ్యానర్ గురించి ?

ఇంత పెద్ద బ్యానర్ లో రెండోసారి వర్క్ చెయ్యడం హ్యాపీ గా ఉంది. నేను తప్ప ఈ సినిమాలో నటించిన ఇతర నటీనటులు దాదాపు కొత్తవారే. ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు.

మీ సినిమా సంక్రాంతికి రావడం గురించి ?

ప్రతి సంక్రాంతికి మూడు నాలుగు సినిమాలు విడుదలవ్వడం సహజం. పండక్కి కుటుంభం అంతా కలిసి చూడదగ్గ సినిమా మాది. మాస సినిమా వేరే సినిమాలకు పోటీ అని నేను భావించను.

కథలో మీకు నచ్చిన అంశం ?

అబ్బాయిలకు, అమ్మాయిలకు ఈ సినిమా ఎక్కడో ఒకచోట కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉండబోతుంది. ఆ పాయింట్ నచ్చి ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాను.

రంగుల రాట్నం టైటిల్ గురించి ?

జీవితం రంగుల రాట్నంలా తిరుగుతూ ఉంటుంది. మా సినిమాలో హీరో జీవితం కూడా అంతే. కథకు తగ్గ టైటిల్ అని భావించి ఈ టైటిల్ ఫిక్స్ చెయ్యడం జరిగింది.

డైరెక్టర్ గురించి ?

మా సినిమా లేడి డైరెక్టర్ చేసినా అబ్బాయి మనస్తత్వం అంత బాగా అర్థం చేసుకొని సినిమా తెరకెక్కించింది. సెల్వ రాఘవన్ దగ్గర దర్శకత్వ శాఖలో వర్క్ చేసింది. తనకు కావాల్సింది తను బాగా రాబట్టుకుంది.

సినిమా మీరు చూసారా?

చూసాను నాకు బాగా నచ్చింది. సినిమా చూస్తునంతసేపు హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆడియన్స్ కు మా సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను.

సినిమా విడుదల తేది ?

రంగుల రాట్నం సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెన్సార్ పూర్తి అయ్యాక విడుదల తేది ప్రకటిస్తాము.