ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కన్నుమూత!

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కన్నుమూత!

Published on Nov 28, 2021 8:48 PM IST


కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఇకలేరు. గత కొద్ది రోజులుగా కరోనాతో పోరాడుతున్న ఆయన ఈ రాత్రి 8 గంటలకు కన్నుమూశారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు విజయ్, అజయ్ ఉన్నారు. గత వారం కరోనా బారిన పడిన శివశంకర్ మాస్టర్ హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు 75 శాతం ఊపిరితిత్తులు దెబ్బతిని పరిస్థితి విషమించగా, ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో పరిశ్రమలో కొందరు ముందుకొచ్చి ఆర్థిక సహాయం అందించారు. మెగాస్టార్ చిరంజీవి 3 లక్షల రూపాయలు తమిళ హీరో ధనుష్ 5 లక్షల రూపాయల అందించగా, సోనూ సూద్ అలాగే మంచు విష్ణు అండగా నిలబడ్డారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా శివ శంకర్ మాస్టర్ ను కాపాడ లేకపోయారు.

10 భాషల్లో 800 కి పైగా సినిమా పాటలకు కొరియోగ్రఫీ చేశారు శివశంకర్ మాస్టర్. వీటిలో తెలుగు, తమిళం వంటి దక్షిణాది సినిమాలో ఎక్కువగా ఉన్నాయి. తెలుగులో రాజమౌళి, రామ్ చరణ్ మగధీర సినిమాలోని ధీర ధీర పాటకు శి‌వశంకర్ మాస్టర్ కు జాతీయ అవార్డ్ దక్కిన విషయం అందరికి తెలిసిందే. బాహుబలి చిత్రానికి కూడా శివశంకర్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. టెలివిజన్ రంగంలో ఆట, జూనియర్స్, ఢీ వంటి కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించి యువ డాన్సర్లకు విలువైన సూచనలు ఇచ్చి ప్రోత్సహించారు. ఆయన మృతి నృత్య కళా రంగానికి తీరని లోటు అని చెప్పాలి.

డిసెంబర్ 7, 1948 లో పుట్టిన శివ శంకర్ మాస్టర్ పాట్టుం భరతముం చిత్రం తో అసిస్టెంట్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. చిన్న వయసులోనే తన వెన్నుముక కి బలమైన గాయం తగిలి విరిగి పోవడం తో 8 సంవత్సరాల వరకు పడుకొనే ఉండటం జరిగింది. బయట ప్రపంచం కి దూరంగా ఉంటూనే ఉన్నాడు. కుటుంబం లో స్త్రీలు తనను చూసుకోవడం జరిగింది. కుటుంబం లో తన తండ్రి కి కర్ణాటక సంగీతం మరియు జ్యోతిష్యం లో నైపుణ్యం ఉండటం తో డాన్స్ పై శివ శంకర్ మాస్టర్ కి అసక్తి కలిగింది.

2011 లో మగధీర చిత్రం లోని ధీర ధీర ధీర పాట కి జాతీయ అవార్డ్ రావడం జరిగింది. 1996 లో పూవే ఉనక్కగా, 2004 లో విశ్వ తులసి, 2006 లో వరలారు, 2008 లో ఉలియిన్ ఒసాయి లకు గానూ తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. డాన్స్ మాస్టర్ గా, నటుడు గా, కమెడీయన్ గా పలు సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాక నాగ భైరవి, జోతి, నంబర్ వన్ కోడలు సీరియల్స్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. శివ శంకర్ మాస్టర్ మరణం తో టాలీవుడ్ ప్రముఖులు, ప్రేక్షకులు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు