బిగ్ బాస్ 6 తెలుగు లో ఫేమస్ సింగర్!

Published on Aug 19, 2022 2:05 pm IST


తెలుగు ప్రేక్షకులని విశేషం గా ఆకట్టుకున్న షో బిగ్ బాస్ రియాలిటీ షో. బిగ్ బాస్ సీజన్ 6 సెప్టెంబరు నెలలో ప్రారంభం కానుంది. స్టార్ మా మరియు బిగ్ బాస్ టీమ్ ఈ షో కోసం పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నాయి. ఈ సంవత్సరం ఈ సిజన్ లో పాల్గొనేవారి గురించి ఒక్కొక్కరి అప్డేట్ లను అందిస్తున్నాము.

ఇప్పుడు, తాజా సమాచారం ప్రకారం, టాలీవుడ్ లో ఫేమస్ సింగర్ అయిన రేవంత్ తప్ప ఈ షో లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. గతేడాది గాయకుడు శ్రీరామచంద్ర ఈ బిగ్ బాస్ షో కి వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. గతంలో ఇండియన్ ఐడల్ లాంటి టైటిల్స్ గెలుచుకున్న రేవంత్‌ని ఈసారి ఎంపిక చేశారు మేకర్స్. మరి షోలో ఎలా రాణిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :