క్రేజీ బజ్ : SSMB28 కి వర్క్ చేయనున్న ఫేమస్ ఫైట్ మాస్టర్స్ …!

క్రేజీ బజ్ : SSMB28 కి వర్క్ చేయనున్న ఫేమస్ ఫైట్ మాస్టర్స్ …!

Published on Aug 17, 2022 1:00 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల లేటెస్ట్ కాంబో మూవీ త్వరలో పట్టాలెక్కనుండగా రోజు రోజుకు ఈ మూవీ పై అందరిలో విపరీతంగా అంచనాలు పెరుగుతున్నాయి. మహేష్ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ దీనిని ఎంతో భారీగా నిర్మించనున్నారు.

యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఎంతో గ్రాండ్ లెవెల్లో రూపొందనున్న ఈ మూవీ కోసం ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు స్టైలిష్ లుక్ లో సిద్దమవ్వగా ఈ మూవీ కోసం ఇటీవల కెజిఎఫ్ 2, విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ కి వర్క్ చేసిన ఫేమస్ ఫైట్ మాస్టర్స్ అన్బరివు సోదరులను తీసుకోనుందట యూనిట్. ఇప్పటికే వారితో డైరెక్టర్ త్రివిక్రమ్ చర్చలు సాగించారట. అన్ని అనుకున్నట్లు జరిగితే వారిద్దరూ త్వరలో ఈ క్రేజీ ప్రాజక్ట్ లోకి అడుగుపెట్టనున్నారట. అయితే ఈ న్యూస్ ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ బజ్ గా వైరల్ అవుతుండగా దీనిపై SSMB28 యూనిట్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం రావలసి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు