‘కబాలి’ సినిమా టికెట్లు దొరకలేదని ప్రాణాలు తీసుకున్న అభిమాని

Fan
అభిమానం విషయంలో మిగతా హీరోలందరితో పోల్చితే రజనీకాంత్ స్థాయి వేరు. ఆయన్ను అభిమానులు హీరోగా కాకుండా దేవుడిగా భావిస్తుంటారు. ఆయన కోసం, ఆయన సినిమాల కోసం పరితపించిపోతుంటారు. మొదటి రోజే ఆయన సినిమా చూడాలన్న ఆశతో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకవేళ టికెట్లు దొరక్కపోతే చాలా డిస్టర్బ్ అవుతుంటారు. మలేషియాలో ఓ అభిమాని అలాగే డిస్టర్బ్ అయ్యాడు. చివరికి ప్రాణాలు తీసుకున్నాడు.

వివరాల్లోకి వెళితే మలేషియాలో శుక్రవారం కబాలి చిత్రం భారీ క్రేజ్ నడుమ పెద్ద ఎత్తున విడుదలైంది. అక్కడ ఫెమస్ ప్లేస్ అయిన కెన్ సిసి ప్రాంతంలో ఉన్న ఓ షాపింగ్ మాల్ లో కబాలి సినిమా మొదటి షో వేస్తున్నారు. ఆ టికెట్ల ఉదయం ఎదురుచూసిన ఓ అభిమాని టికెట్లు దొరక్కపోవడంతో మనస్తాపం చెంది 10వ అంతస్థు నుండి కిందికి దూకాడు. పక్కనుండే వారు కాపాడాలని ప్రయత్నించినా ఆ అభిమాని సహకరించకుండా కిందికి దూకి ప్రాణాలు విడిచాడు.