వైరల్ అవుతోన్న ఫ్యాన్ మేడ్ “ఆదిపురుష్” కాన్సెప్ట్ పోస్టర్!

Published on Aug 28, 2022 10:25 pm IST

యాక్షన్ థ్రిల్లర్ సలార్ విడుదల తేదీని ప్రకటించడంతో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే సలార్ కంటే ముందు ప్రభాస్ పౌరాణిక చిత్రం అయిన ఆదిపురుష్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా కూడా ఐ మాక్స్ 3డి ఫార్మాట్‌లో రానుంది.

ఈ చిత్రం లో ప్రభాస్ ఎలా ఉండనున్నారు అనే దానిపై ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం నుండి అతని లుక్ ఇంకా రివీల్ కాలేదు. అయితే ఫ్యాన్ మేడ్ కాన్సెప్ట్ పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టర్‌లో ప్రభాస్‌ని రాముడి అవతారంలో చూపించారు. ఈ కాన్సెప్ట్ పోస్టర్ చాలా బాగుంది. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి తాన్హాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. కృతి సనన్ కథానాయికగా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి సీజన్‌లో జనవరి 12, 2023 న విడుదల అవుతుంది.

సంబంధిత సమాచారం :