‘అర్జున క‌ళ్యాణం’ గురించి రోడ్డు పై రచ్చ.. నెటిజన్లు ఫైర్ !

Published on May 1, 2022 9:30 pm IST

యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’ సినిమా మే6న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ఐతే, ప్రమోషన్స్‌ లో భాగంగా సినిమా బృందం ఒక ప్రాంక్‌ వీడియో చేసింది. కానీ.. ఈ వీడియో మిస్ ఫైర్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో పై నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ వీడియోలో ఏముంది ?

విశ్వ‌క్ సేన్ కారుకి ఓ యువ‌కుడు అడ్డు పడి, నడిరోడ్డుపై హల్‌చల్‌ చేశాడు. అల్లం అర్జున్ కుమార్ (అశోక వనంలో అర్జున కళ్యాణంలో విశ్వక్‌ సేన్‌ పేరు)కి 33 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు అంటూ అతను అతి చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా.. విలేజ్ బ్యాక్ డ్రాప్ పెళ్లి నేపథ్య కథతో బాపినీడు – సుధీర్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు.

లేటు వయసులో పెళ్లి చేసుకోబోతున్న హీరో.. ఆ పెళ్లి అవుతుందా లేదా అనే టెన్షన్‌ లో పడే పాట్లు.. ఇలా సాగుతుంది ఈ సినిమా. ఈ సినిమాతో, విద్యాసాగర్ చింత దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

సంబంధిత సమాచారం :