మహేష్ బాబు సినిమాకు మంచి డీల్ కుదిరింది !

26th, September 2017 - 09:56:42 AM


సూపర్ స్టార్ మహేష్ బాబు ‘స్పైడర్’ చిత్రం రేపు రిలీజ్ కానుండగా ఆయన మరొక చిత్రం ‘భరత్ అనే నేను’ షూటింగ్ దశలో ఉంది. ప్రస్తుతం మహేష్ ‘స్పైడర్’ ప్రమోషన్లలో బిజీగా ఉండటం వలన కొరటాల సినిమాకు కాస్త బ్రేక్ ఏర్పడింది. ఒకసారి ‘స్పైడర్’ విడుదల పూర్తికాగానే షూట్ మొదలుకానుంది. మహేష్ – కొరటాల కాంబోలో రూపొందిన ‘శ్రీమంతుడు’ ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ అంచనాలతోనే చిత్ర హక్కులకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. తాజా సమాచారం ప్రకారం చిత్ర ఓవర్సీస్ హక్కులు రూ.18.18 కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం. పేరు బయటకురాలేదు కానీ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ హక్కుల్ని దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ సంగీతం అందిస్తుండగా కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.