ఫ్యాన్సీ రేటుకు నాని ‘కృష్ణార్జున యుద్ధం’ హక్కులు !
Published on Dec 5, 2017 11:25 am IST

ఈ మధ్యే ‘నిన్ను కోరి’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుని వరుసగా 7వ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న నాని తన తర్వాతి రెండు సినిమాలను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. వాటిలో శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తున్న ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ ఇప్పటికే షూటింగ్ చివరి దశలో ఉండగా మేర్లకపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్న ‘కృష్ణార్జున యుద్ధం’ కూడా ఈ మధ్యే షూటింగ్ మొదలుపెట్టుకుంది.

నాని డ్యూయెల్ రోల్ చేస్తున్న ఈ ‘కృష్ణార్జునల యుద్ధం’ యొక్క థియేట్రికల్, శాటిలైట్ హక్కుల్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫ్యాన్సీ ధరకు కొనుగోలుచేసినట్టు తెలుస్తోంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హిపాప్ తమిజాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరికి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతుండగా ‘ఎం.సి.ఏ’ ను ఈ డిసెంబర్ 21న విడుదలచేయనున్నారు.

 
Like us on Facebook