RRR ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించని విజయేంద్ర ప్రసాద్!

RRR ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించని విజయేంద్ర ప్రసాద్!

Published on Mar 21, 2022 5:30 PM IST

రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ను విడుదలైన మొదటి రోజే చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. RRR చిత్ర యూనిట్ ఇండియా వైడ్‌గా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడంలో బిజీగా ఉంది మరియు సినిమా అత్యద్భుతమైన ఓపెనింగ్స్ ను తీసుకుంటుంది అని చెప్పాలి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో రచయిత విజయేంద్ర ప్రసాద్‌ని చూడాలని సోషల్ మీడియా కోరుకుంటోంది. అతను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో ఎక్కడా కనిపించలేదు

విజయేంద్ర ప్రసాద్ కొన్ని నెలల క్రితం వివిధ వేదికలపై సినిమాను ప్రమోట్ చేస్తూ కనిపించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ నుంచి ఆయన తప్పుకోవడం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక కారణం ఏమిటో రాజమౌళికే తెలియాలి. అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం లో శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మార్చ్ 25 వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు