మహేష్ బర్త్ డే వేడుకల్లో భాగంగా సేవ కార్యక్రమాలు చేస్తున్న అభిమానులు !

Mahesh Babu

‘భరత్ అనే నేను చిత్రం’ తో సాలిడ్ హిట్ కొట్టి ప్రస్తుతం తన 25వ చిత్రంలో నటిస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు . ఆగష్టు 9 న ఆయన తన 43 వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. అభిమానులు మాత్రం కొంచం ముందుగానే ఆయన పుట్టిన రోజు వేడుకలను నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా కొద్దీ రోజుల క్రితం నుండే అభిమాన సంఘాల ఆధ్వర్యంలో సేవ కార్యక్రమాలను ప్రారంభించారు . ఆయన పేరుతో అన్నదానాలు , వృద్దులకు పండ్లు మరియు వస్తువులు పంపిణీ చేయడం వంటి పనులను చేస్తున్నారు .

మహేష్ కూడా సోషల్ సర్వీస్ చేయడంలో ముందు వరుసలో ఉంటాడు. దాంట్లో భాగంగా ఊరుని దత్తత తీసుకొని అక్కడి ప్రజల అవసరాలను తీరుస్తున్నారు. ఇక భరత్ అనే నేను చిత్రం తో తన రేంజ్ ఏంటో మరోసారి తెలియజేసాడు . ఈ చిత్రం విజయం తో ఆయన పాపులారిటీ మరింతగా పెరిగింది.

Exit mobile version