“టైగర్ నాగేశ్వరరావు” ప్రీపోన్.. ఫ్యాన్స్ కి ఇష్టం లేదా?

Published on Sep 5, 2023 7:20 am IST


మాస్ మహారాజ రవితేజ హీరోగా బాలీవుడ్ హీరోయిన్ నపూర్ సనన్ హీరోయిన్ గా టాలీవుడ్ పరిచయం అవుతూ దర్శకుడు వంశీ తెరకెక్కించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం “టైగర్ నాగేశ్వరరావు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్ అనుకున్న దానికంటే ముందే వస్తుంది అని స్ట్రాంగ్ టాక్ మొదలైంది. అయితే ఈ చిత్రం ప్రీపోన్ విషయంలో ఫ్యాన్స్ లో చాలా వరకు అంత ఎగ్జైట్మెంట్ లేదు అని తెలుస్తోంది.

ప్రీపోన్ అంటే ఇతర హీరోస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తారు. కానీ రవితేజ ఫ్యాన్స్ మాత్రం ప్రస్తుతానికి వద్దు అనుకుంటున్నారు. తమ హీరో చేస్తున్న మొదటి భారీ పాన్ ఇండియా సినిమా ఇది అని క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావద్దని సోలో రిలీజ్ కోసం ఇంకా ఇప్పుడు ఉన్న సీజీ ఔట్ పుట్ తోనే వస్తే కష్టం అని సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు మేకర్స్ ఈ అక్టోబర్ 6 రిలీజ్ కి చూస్తున్నారట. మరి దీనిపై ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :