“వలిమై” కోసం వెయిటింగ్ అంటూ సోషల్ మీడియా లో ట్రెండ్!

Published on Sep 12, 2021 9:35 pm IST

సౌత్ ఇండియా హీరోల్లో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో అజిత్ ఒకరు. సౌత్ ఇండియా లో అజిత్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కేవలం తమిళం లో మాత్రమే కాకుండా, ఇతర బాషల్లో కూడా ఆయనకు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వలిమై.

ఈ చిత్రం నుండి ఇప్పటికే పోస్టర్లు మరియు ఫస్ట్ సింగిల్ విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ అప్డేట్ లతో సోషల్ మీడియా నే షేక్ చేశారు అజిత్ కుమార్ ఫ్యాన్స్. అయితే వలిమై చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే సెకండ్ సింగిల్ మరియు విడుదల తేదీ ల పై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే అజిత్ కుమార్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియా లో వీకెండ్ కావడం తో ట్రెండ్ షురూ చేశారు. #awaitingforvalimaihunt అంటూ సోషల్ మీడియా లో తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఈ ట్యాగ్ సోషల్ మీడియా లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఫ్యాన్స్ మాత్రం సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు చెబుతున్నారు. అయితే అజిత్ కి సంబంధించిన ఫోటో ఒకటి తాజాగా బయటికి రావడం తో ఆ ఫోటో ను సైతం షేర్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :