ఆర్ ఆర్ ఆర్ మూవీ: చరణ్ ఇంట్రో పై పెరుగుతున్న అంచనాలు!

Published on Dec 27, 2021 12:02 am IST

రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇద్దరు టాప్ హీరోలు కలిసి, పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రం లో ఇద్దరినీ కూడా జక్కన్న రాజమౌళి చాలా అద్బుతం గా చూపించారు. ట్రైలర్ ను చూస్తే తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీ హైలైట్ గా ఉంటుంది అని తెలిపారు రాజమౌళి. 2000 మంది తో జనాలను కంట్రోల్ చేసే సన్నివేశం ను చిత్రీకరించడం పట్ల ఎగ్జైట్ అవుతూ తెలిపారు. ఈ ఇంట్రో పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ అభిమానులు మాత్రం ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నారు.

ఈ చిత్రం లో అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రియ శరణ్, అజయ్ దేవగన్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం ను జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ గా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :