ఊరిస్తూ, ఉడికిస్తున్న ‘రంగస్థలం’ టీమ్ !

24th, January 2018 - 07:00:17 AM

మెగా హీరో రామ్ చరణ్ తేజ్ నటించిన ‘రంగస్థలం’ చిత్ర టీజర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వింటేజ్ లుక్ లో ఉన్న చరణ్ ను చూడాలని తహతహలాడిపోతున్నారు. దానికి తోడు చిత్ర టీమ్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన పోస్టర్లతో టీజర్ ఏ స్థాయిలో ఉంటుందో హింట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ను ఊరిస్తూ, ఉడికిస్తున్నారు. దీంతో అభిమానుల్లో ఇంకాస్త ఆతురత ఇంకాస్త ఎక్కువైపోయింది.

ఇంతటి అంచనాలు కలిగిన ఈ టీజర్ ఈరోజు సాయంత్రం 4 గంటల 15 నిముషాలకు విడుదలకానుంది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 30న రిలీజ్ చేయనున్నారు. దేవి శ్రీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సమంత కథానాయకిగా నటిస్తుండగా ఆది పినిశెట్టి, అనసూయలు పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుతున్న ఈ చిత్రం వసూళ్ళ పరంగా కూడా భారీ సంఖ్యల్ని నమోదు చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.