‘వాల్తేరు వీరయ్య’ మెగా మాస్ సాంగ్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

‘వాల్తేరు వీరయ్య’ మెగా మాస్ సాంగ్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

Published on Dec 29, 2022 1:34 AM IST

మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య నుండి ఇప్పటికే రిలీజ్ అయిన మూడు సాంగ్స్ కూడా అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ చేసాయి. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని బాబీ తెరకెక్కిస్తుండగా మాస్ మహారాజా రవితేజ ఇందులో ఒక కీలక పాత్ర చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అయితే విషయం ఏమిటంటే, వాల్తేరు వీరయ్య నుండి పూనకాలు లోడింగ్ అనే మాస్ ఎనర్జిటిక్ సాంగ్ ని అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే యూనిట్ ప్రకటించింది.

మెగాస్టార్ చిరంజీవి తో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా ఈ సాంగ్ లో చిందేయనున్నారట. కాగా లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం, ఈ సాంగ్ ని డిసెంబర్ 30న హైదరాబాద్ లోని ప్రముఖ థియేటర్స్ లో ఒకటైన సంధ్య థియేటర్ లో సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ గా ఫ్యాన్స్ మధ్యన రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా దీనిపై వాల్తేరు వీరయ్య యూనిట్ నుండి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. మొత్తంగా ఈ మెగా మాస్ సాంగ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక వాల్తేరు వీరయ్య మూవీ 2023 జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు