అనుకున్న విధంగానే చెలరేగుతున్న ఎన్టీఆర్


ఎన్టీఆర్ నటిస్తున్న జైలవకుశ ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే జై, లవ పాత్రలను రివీల్ చేస్తూ చిత్ర యూనిట్ టీజర్ లను విడుదల చేసింది. టీజర్ లకు వస్తున్న స్పందన చూస్తుంటే ఎన్టీఆర్ కు మరో భారీ హిట్ ఖాయంగా కనిపిస్తోంది. వినాయకచవితి సందర్భంగా నిన్న లవ టీజర్ ని విడుదల చేశారు. ఆడియన్స్ నుంచి ఈ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఈ టీజర్ కు 6 మిలియన్ వ్యూస్ లభించాయి.

ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. కుశ లుక్ ని కూడా నిన్న విడుదల చేశారు. ఎన్టీఆర్ ఈ చిత్రంలో త్రిపాత్రాభినయం చేస్తుండడంతో ఇంతటి క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రానికి బాబీ దర్శకతం వహిస్తున్న విషయం తెలిసిందే.