క్రేజీగా మారిన బాలకృష్ణ డైలాగులు !
Published on Jul 31, 2017 9:21 am IST


గత శుక్రవారం విడుదలైన నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం ‘పైసా వసూల్’ తాలూకు స్టంపర్ వీడియో అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఊపేస్తోంది. ముఖ్యంగా బాలకృష్ణ నోట పలికిన పూరి డైలాగులు ఫ్రేమును ఫ్రేముకి పటాకుల్లా పేలుతూ హుషారెత్తిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఇవే డైలాగ్స్ పదే పదే వినబడుతున్నాయి. ఇదివరకెన్నడూ లేని విధంగా బాలకృష్ణ సరికొత్త ఎనర్జీతో నటిస్తుండంతో ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం ఖాయమని అంతా భావిస్తున్నారు.

ఇక ఇప్పటి వరకు ఈ స్టంపర్ వీడియోకు యూట్యూబ్ లో 4 మిలియన్లకు పైగానే వ్యూస్ దాదాపు 70 వేల లైక్స్ దక్కాయి. ముందుగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 29న విడుదలచేయాలనుకోగా అన్ని పనులు ముందే పూర్తవుతుండటంతో సెప్టెంబర్ 1న రిలీజ్ చేయనున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శ్రియ శరన్ హీరోయిన్ గా నటిస్తోంది.

 
Like us on Facebook