విజయ్ సేతుపతికి అభిమానుల సజేషన్.. ఏమని అంటే?

Published on Oct 7, 2021 8:58 pm IST


తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతికి తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉంది. దళపతి విజయ్‌ హీరోగా చేసిన ‘మాస్టర్‌’ సినిమాలో విలన్‌గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న సేతుపతి, ఇటీవల మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా చేసిన ‘ఉప్పెన’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన కృతిశెట్టికి తండ్రిగా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. అయితే సేతుపతి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.

కాగా ప్రస్తుతం ఆయన నటించిన కొన్ని సినిమాలు ఓటీటీల్లో విడుదలవుతుండగా, మరికొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో సేతుపతి నటించిన కొన్ని సినిమాలు ప్లాపులుగా నిలుస్తూ అభిమానులను నిరాశకు గురిచేస్తున్నాయి. దీంతో అభిమానులు సేతుపతికి కొన్ని సజేషన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. మొహమాటంతో ఏ సినిమా పడితే ఆ సినిమా చేయొద్దని రిక్వెస్ట్ చేస్తూ, మంచి కంటెంట్ ఉన్న సినిమాలనే ఎంచుకోవాలని సూచిస్తున్నారట.

సంబంధిత సమాచారం :