మహేష్ ఇచ్చిన ట్రీట్ తో అభిమానుల్లో రెట్టింపైన ఉత్సాహం !


సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’ చిత్రం యొక్క ట్రైలర్, ‘అక్కడ ఉన్నాడు’ అనే మాస్ పాట నిన్న సాయంత్రం విడుదలయ్యాయి. ఏమాత్రం ముందస్తు సూచన లేకుండా ఒక గంట ముందు మాత్రమే ప్రకటించి టీమ్ వీటిని రిలీజ్ చేయడంతో అభిమానులంతా సప్రైజ్ కు గురయ్యారు. పైగా ట్రైలర్ అంచనాలకు తగ్గట్టు చాలా బాగుండటం, పాట కూడా మాస్ బీట్లతో ఎంజాయ్ చేసే విధంగా ఉండటంతో ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం నెలకొంది.

ఇప్పటికే బోలెడంత క్రేజ్ ను మూటగట్టుకున్న ఈ చిత్రం వీటి వలన ఇంకాస్త హైప్ ను పెంచుకుని భారీ ఓపెనింగ్స్ ను టార్గెట్ చేస్తోంది. తెలుగు, తమిళంతో పాటు ఇంకొన్ని భాషల్లో రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని ఈ నెల 27న రిలీజ్ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, ఓవర్సీస్లలో చిత్రం భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకురానుంది. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి హారీశ్ జైరాజ్ సంగీతాన్ని అందించగా రకుల్ ప్రీత్ కథానాయకిగా నటించింది.

ట్రైలర్ కోసం క్లిక్ చేయండి: