కమల్ కోసం అభిమానుల సరికొత్త ప్రచారం

Papanasam_poster

మొదట మలయాళం, తర్వాత కన్నడ, ఆ తర్వాత తెలుగు, ఇప్పుడు మలయాళం. ఏంటి అటు తిప్పి ఇటు తిప్పి అన్ని సౌత్ ఇండియన్ భాషలు చెప్పేసాడని అనుకుంటున్నారా,.? నేను చెబుతోంది మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘దృశ్యం’ గురించి.. ఇప్పటికే సౌత్ ఇండియాలోని మూడు భాషల్లో వచ్చి విజయం అందుకున్న ఈ సినిమా ఈ వారం ‘పాపనాశనం’ పేరుతో తమిళ్ లో రిలీజ్ కానుంది. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, గౌతమి కలిసి ఇందులో నటించారు. జూలై 3న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

కేవలం కమల్ టీం మాత్రమే కాకుండా ఆయన అభిమానులు కూడా ఈ సినిమాని సరికొత్త రీతిలో ప్రమోట్ చేయనున్నారు. ఈ సినిమా రిలీజ్ రోజుని ధోతి లేదా వేస్తి డేగా నిర్ణయించారు. ఆ రోజు కమల్ అభిమానులు అంతా థియేటర్ కి ధోతీలోరానున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్ ఓ మిడిల్ క్లాస్ మాన్ లా కనిపించడం, అలాగే ఆయన సినిమాలో ఎక్కువ భాగం ధోతీలో కనిపించడమే ఈ సరికొత్త ప్రచారానికి కారణం అని అభిమానులు అంటున్నారు. ఈ సినిమా మలయాళ వెర్షన్ లో మోహన్ లాల్ హీరోగా నటిస్తే, తెలుగులో వెంకటేష్ నటించాడు. వారిలానే మన కమల్ కూడా ఈ సినిమాతో తమిళ్ లో హిట్ అందుకుంటాడేమో చూడాలి.

Exit mobile version