పవన్ లైనప్ లోకి ఆ రీమేక్..సరైన క్లారిటీ కోసం వెయిటింగ్.!

Published on Mar 2, 2022 6:01 pm IST

ప్రస్తుతం పవర్ స్టార్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం “భీమ్లా నాయక్” బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మళయాళ హిట్ సినిమా “అయ్యప్పణం కోషియం” కి రీమేక్ గా చేశారు. ఇక ఇక్కడ తో పవన్ కెరీర్ లో రీమేక్స్ కి బ్రేక్ ఇచ్చి మిగతా డైరెక్ట్ సినిమాలు ఫోకస్ పెడతారు అనుకుంటే ఈ లిస్ట్ మధ్య లోకి ఇంకో రీమేక్ చెయ్యాలని పవన్ అనుకుంటున్నట్టు టాక్ ఆ మధ్య బయటకి వచ్చింది.

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో తమిళ్ లో హిట్ అయ్యిన “వినోదయ సితం” సినిమాని రీమేక్ చేస్తున్నట్టు టాక్ బయటకి వచ్చింది. అయితే ఇప్పుడు పవన్ ఈ సినిమాని స్టార్ట్ చెయ్యాలని చూస్తున్నారట. ఇంతకు ముందు అయితే పవన్ కేవలం ఈ చిత్రాన్ని నిర్మాణం వరకు మాత్రమే వర్క్ చేస్తారని టాక్ రాగా ఇప్పుడు అయితే ఇందులో నటించడం కూడా జరుగుతుంది అని తెలుస్తుంది. దీనితో ఈ సినిమాపై ఓ అధికారిక క్లారిటీ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. మరి ఆ క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :