ఆసక్తిగా మారిన “ఆదిపురుష్” ప్రమోషన్స్.!

Published on Mar 21, 2023 10:02 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన మాసివ్ పీరియాడిక్ చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. మరి రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రభాస్ ఫ్యాన్స్ లో చాలా స్పెషల్ ప్రాజెక్ట్ గా నిలిచింది. కానీ టీజర్ తో ఆ అంచనాలు అన్నీ మేకర్స్ తలకిందులు చేయడంతో నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. దీనితో రిలీజ్ ని వాయిదా వేశారు.

ఇక ఈ రిలీజ్ కి సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ కోసం ఎలాంటి అప్డేట్ ఇప్పుడు మేకర్స్ నుంచి లేదు. దీనితో ఫ్యాన్స్ లో మరింత కంగారు నెలకొనగా ఈ రామ నవమి రోజు నుంచి అయితే చిత్ర యూనిట్ స్వింగ్ లో ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయనున్నట్టుగా బజ్ వినిపిస్తుంది. మరి గతంలో ఏ రామ నవమికి కూడా చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి భారీ అప్డేట్స్ లేవు. ఈసారి అయితే అదిరే ట్రీట్ తో స్టార్ట్ చేస్తారని టాక్ ఉంది. మరి దీని కోసం వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :