బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్. షారుఖ్ ఖాన్ పఠాన్ తర్వాత వస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హిందీ లో మాత్రమే కాకుండా, తమిళ్ మరియు తెలుగు బాషల్లో రేపు వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో భారీగా రిలీజ్ కానుంది. అయితే ఈ చిత్రం లో బిగ్ సర్ప్రైజ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు వెర్షన్ లో, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తమిళ్ వెర్షన్ లో, బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ హిందీ వెర్షన్ లో గెస్ట్ రోల్ లో కనిపించనున్నట్లు గతం లో వార్తలు వచ్చాయి. వీటిపై ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే సినిమా పై ఈ న్యూస్ ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంది. ఈ సర్ప్రైజ్ కి ఇంకా ఒక రోజు మాత్రమే ఉండటం తో ఫ్యాన్స్ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. అనిరుద్ రవి చందర్ సంగీతం అందించిన ఈ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. దీపికా పదుకునే ముఖ్య పాత్రలో కనిపించనుంది.