నేటి రాత్రి నుండి “మాలిక్” ప్రైమ్ వీడియో లో…ఎదురు చూస్తున్న అభిమానులు!

Published on Jul 14, 2021 1:00 pm IST

థియేటర్లు ఇంకా పూర్తి స్థాయిలో తెరుచుకోకపోవడం తో కొన్ని సినిమాలు డైరెక్ట్ ఓటిటి గా విడుదల అవుతున్నాయి. అయితే మలయాళ ప్రముఖ నటుడు ఫాహద్ నటించిన తాజా చిత్రం మాలిక్ నేటి రాత్రి నుండి ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ కానుంది. అయితే ఇందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మునుపెన్నడూ లేని విధంగా సినిమాలు భారీగా ఓటిటి ద్వారా విడుదల అవుతుండటం తో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఫాహద్ టాలీవుడ్ లో పుష్ప చిత్రం తో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా పుష్ప చిత్రం లో ఫాహద్ విలన్ పాత్ర లో నటిస్తున్నారు. అయితే ఫాహద్ పేరు టాలీవుడ్ లో మారు మ్రోగుతున్నప్పటి నుండి మాలిక్ కోసం సైతం ఎదురు చూస్తున్నారు. అయితే మహేశ నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో నిమిష సాజయన్, మీనాక్షి రవీంద్రన్, దిలీప్ పోతన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం సుషిన్ శ్యామ్ అందించారు.

సంబంధిత సమాచారం :