విజయ్-పైడిపల్లి సినిమా అనౌన్స్ అయ్యేది అప్పుడేనా ?

Published on May 24, 2021 7:30 pm IST

తమిళ స్టార్ హీరో విజయ్ తెలుగు మార్కెట్ మీద గట్టిగా దృష్టి పెట్టారని అర్థమవుతోంది. ఆయన గత సినిమాలు రెండూ తమిళంతో పాటు తెలుగులో కూడ మంచి విజయాన్ని అందుకున్నాయి. అందుకే నేరుగా తెలుగు అదృష్టాన్ని పరీక్షించుకోవాలని విజయ్ అనుకుంటున్నారు. కాబట్టే ఆయన వంశీ పైడిపల్లి సినిమాలు ఓకే చెప్పారని టాక్. ‘మహర్షి’ సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న వంశీ పైడిపల్లి ఇప్పటివరకు కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. ఇటీవలే ఆయన విజయ్ కు కథ చెప్పారని, విజయ్ కూడ కథ నచ్చి సినిమా చేయడానికి సుముఖంగా ఉన్నారట.

ప్రతి ఏడాది విజయ్ పుట్టినరోజునాడు ఆయన కొత్త సినిమాలు అనౌన్స్ అవుతుంటాయి. ఆయన తన 47వ పుట్టినరోజును జూన్ 22న జరుపుకోనున్నారు. ఒకవేళ నిజంగానే విజయ్ వంశీ పైడిపల్లి సినిమా చేస్తుంటే జూన్ 22న క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి ఆ రోజున సినిమా మీద క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఇకపోతే ప్రస్తుతం తన 65 వ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న విజయ్ 66వ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో చేయనున్నారు. ఒకవేళ ఉంటే వంశీ పైడిపల్లి చిత్రం ఈ రెండు సినిమాల తర్వాత ఉండవచ్చు.

సంబంధిత సమాచారం :