విజయ్ “బీస్ట్” అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్!

Published on Feb 7, 2022 1:32 pm IST

స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన బీస్ట్, ప్రస్తుతం కోలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు క్రేజీ అప్‌డేట్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ భారీ బడ్జెట్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు ఈ తాజా ప్రకటన తో సోషల్ మీడియాలో బీస్ట్ హ్యాష్ ట్యాగ్స్ తో వైరల్ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. విజయ్ నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :