“చరణ్ 15” నుంచి కొత్త అప్డేట్ కోరుకుంటున్న అభిమానులు..!

“చరణ్ 15” నుంచి కొత్త అప్డేట్ కోరుకుంటున్న అభిమానులు..!

Published on Aug 17, 2022 7:06 AM IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర మంచి మోస్ట్ అవైటెడ్ గా ఉన్న భారీ సినిమాల్లో ఇండియన్ జేమ్స్ క్యామెరున్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబోలో తెరకెక్కుతున్న వారి బెంచ్ మార్క్ మూవీ 15వ సినిమా కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు కానిచ్చినా ఇంకా సరైన అప్డేట్ ఏదీ రివీల్ కాలేదు పైగా మొన్న ఆగస్ట్ 15కి చేసిన ప్లానింగ్ కూడా జరగలేదు.

ఇక ఇదిలా ఉండగా ఈ గాప్ లోనే సినిమా దర్శకుడు శంకర్ పుట్టిన రోజు కూడా వచ్చేసింది. దీనితో ఇప్పుడు మేకర్స్, రామ్ చరణ్ లు పెట్టే పోస్ట్స్ కోసం ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. ఈసారి అయినా కాస్త కొత్త పోస్టర్ తో అయినా విషెస్ తెలియజేస్తారేమో అని ఆశిస్తున్నారు. మొత్తానికి అయితే ఈ సినిమా విషయంలో అభిమానులు కొత్త అప్డేట్స్ ని అయితే కోరుకుంటున్నారు. మరి ఇవి ఎప్పుడు నెరవేఫుతాయో చూడాలి.. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు