బెనిఫిట్ షోవెయ్యకపోవడంతో అభిమానుల ఆగ్రహం

18th, October 2017 - 06:20:59 PM

రవితేజ సినిమా వచ్చి దాదాపు రెండు ఏళ్ళు అయ్యింది, చాలా గ్యాప్ తరువాత తమ అభిమాన హీరో సినిమా విడుదల కాబోతు ఉండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది, దీపావళి పండుగ సందర్బంగా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘రాజా ది గ్రేట్’ సినిమాకు సంభందించి చేదు అనుభవం సూర్యాపేటలో తేజ మూవీ మాక్స్ ధియేటర్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే…

బెనిఫిట్ షో ఎర్లీ మార్నింగ్ వేస్తామని ధియేటర్ యాజమాన్యం ప్రేక్షకుల నుండి డబ్బులు వసూలు చేసి టికెట్స్ విక్రయించారు. అనుకున్న టైం కి షో పడకపోవడంతో ప్రేక్షకులు సహనాన్ని కోల్పోయారు. ధియేటర్ లోపలికి ప్రవేశించి స్క్రీన్, కుర్చీలు ద్వంశం చేశారు. షో వెయ్యడానికి పోలీసు వారి నుండి అనుమతి రాకపోవడంతో షో వేయలేదనేది ధియేటర్ యాజమాన్యం చెప్తున్నారు. ఈ సంఘటన అనంతరం ధియేటర్ ఓనర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.