‘సీతారామం’ స‌క్సెస్‌ ను సెల‌బ్రేట్ చేసిన ‘జాతిర‌త్నాలు’ హీరోయిన్ !

Published on Aug 6, 2022 10:10 pm IST

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ థాకూర్ హీరోయిన్‌గా రష్మిక మందన్నా కీలక పాత్రలో వచ్చిన ‘సీతా రామం’ ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ను రాబడుతుంది. యుద్ధంతో రాసిన ప్రేమ‌క‌థ అంటూ వచ్చిన ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. మొత్తానికి నిన్న రిలీజైన ‘సీతారామం’ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందింది.

అలాగే, నెటిజన్లు కూడా ఈ సినిమాను పొగుడుతూ ట్వీట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా జాతిర‌త్నాలు ఫేమ్ ఫ‌రియా అబ్దుల్లా, హీరోయిన్ మృణాల్‌తో క‌లిసి ‘సీతా రామం’ స‌క్సెస్‌ ను సెల‌బ్రేట్ చేసింది. ఈ క్రమంలో ఫ‌రియా అబ్దుల్లా, హీరోయిన్ మృణాల్‌ ఇద్దరూ క‌లిసి సీతారామంలోని పాట‌కు డ్యాన్స్ చేస్తూ ఒక వీడియోలో క‌నిపించారు.

సంబంధిత సమాచారం :