అక్కినేని అఖిల్ తో యంగ్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ ?

అక్కినేని అఖిల్ తో యంగ్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ ?

Published on Jul 9, 2022 9:30 PM IST

దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రస్తుతం ‘ఏజెంట్’ అంటూ అక్కినేని అఖిల్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ స్టైలిష్ స్పై థ్రిల్లర్ నుంచి ఒక అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. ఈ సాంగ్ లో యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా నటిస్తోందని తెలుస్తోంది. జాతిరత్నాలు సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న ఫరియా అబ్దుల్లా ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తోంది.

ఈ సినిమాలో అఖిల్ తన నరాలు కూడా బలంగా ఎలివేట్ అయ్యేలా కండలు పెంచి మరీ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అఖిల్ రెండు వేరియేషన్స్ ఎలివేట్ అయ్యేలా రెండు లుక్స్ లో సాలిడ్ పర్సనాలిటీలో కనిపించనున్నాడు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. సాక్షీ వైద్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మమ్ముట్టి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు