గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న ‘జాతిరత్నాలు’ హీరోయిన్ ఫరియా..!

Published on Dec 26, 2021 1:30 am IST

టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. అయితే తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ‘జాతిరత్నాలు’ ఫేం హీరోయిన్ ఫరియా అబ్దుల్లా పాల్గొన్నారు. ఈ మేరకు ఫిలింనగర్‌లో ఆమె మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఫరియా అబ్దుల్లా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం తనకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ ఛాలెంజ్ కొనసాగింపులో భాగంగా హీరోలు ఆనంద్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ శాన్వీ మేఘనలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని ఫరియా సవాల్ విసిరింది. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ ఫరియాకు వృక్ష వేదం పుస్తకాన్ని బహుమతిగా అందజేశారు.

సంబంధిత సమాచారం :