ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన సూపర్ స్టార్ “పెన్నీ సాంగ్”

ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన సూపర్ స్టార్ “పెన్నీ సాంగ్”

Published on Mar 21, 2022 2:58 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం సర్కారు వారి పాట. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో డైరక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్ టైన్మెంట్స్ మరియు 14 రీల్స్ ప్లస్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

ఈ చిత్రం నుండి విడుదల అయిన సెకండ్ సింగిల్ పెన్నీ సాంగ్ కి విశేష స్పందన లభిస్తోంది. ఈ పాట ఇప్పుడు టాలీవుడ్ లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. అంతేకాక తన రికార్డ్ ను తనే బద్దలు కొట్టారు మహేష్. అంతకు ముందు కళావతి పాటకి 24 గంటల్లో 14.78 మిలియన్స్ వ్యూస్ రాగా, 22 గంటల్లో ఈ పెన్నీ సాంగ్ కి 15 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. అయితే ఫాస్టెస్ట్ 15 మిలియన్స్ వ్యూస్ అందుకున్న సాంగ్ కి టాలీవుడ్ లో రికార్డ్ క్రియేట్ చేయడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.

బ్యాంకింగ్ రంగంలో జరిగే స్కాం ల ఆధారం గా ఈ చిత్రం నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ను మే 12, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు