విజయ దశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు “ఫాతిమా”

Published on Sep 28, 2021 7:00 am IST

విజయ దశమి కానుక గా విడుదల కానున్న ఫాతిమా చిత్రం ను శ్రీ చండ్ర మూవీస్ పతాకం పై అభిరుచి గల నిర్మాత చండ్ర మధు నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి తోట క్రిష్ణ దర్శకుడు. చిత్ర విడుదల సందర్భం గా జరిగిన పాత్రికేయుల సమావేశానికి చదలవాడ శ్రీనివాసరావు, దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్, ముత్యాల రాందాస్, మోహన్ వడ్లపట్ల, చంద్ర శేఖర్, ప్రసాద్ రెడ్డి తో పాటుగా చిత్రంలో నటించిన సంహిత, భావన, మధురిమ, తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

చండ్ర మధు గారు మాకు మంచి మిత్రులు, ఎంతో ఆదర్శ భావాలు కలిగిన మంచి మనసున్న వ్యక్తి . వారు నిర్మించిన ఈ ఫాతిమా (ఫ్రమ్ పాకిస్తాన్ వయా చైనా ఉప శీర్షిక) చిత్రం విజయాన్ని సాధించి,మంచి లాభాలు రావాలని ఇకముందు కూడా మరిన్ని చిత్రాలు నిర్మించాలని కోరుకుంటున్నాం అని అన్నారు.

నిర్మాత చండ్ర మధు మాట్లాడుతూ, “మా ఫాతిమా చిత్ర యూనిట్ ని ఆశీర్వ దించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ మరియు పాత్రికేయ మిత్రులకు నా కృతజ్ఞతలు. విజయ దశమి కానుక గా మా ఫాతిమా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. అలాగే అదేరోజు మా శ్రేయోభిలాషి ప్రసాద్ రెడ్డి గారి దర్శత్వంలో మరో చిత్రాన్ని మా బేనర్ లో ప్రారంభిస్తాం. ఆయన ఒక మంచి కథను రెడీ చేసారు” అని అన్నారు.

దర్శకులు తోట క్రిష్ణ మాట్లాడుతూ, “వచ్చిన అతిథులు అందరికీ నా కృతజ్ఞతలు. మధు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. షూటింగ్లో మాకు ఏ లోటూ లేకుండా అన్నీ సమకూర్చారు. ఆర్టిస్టులు, టెక్నీషయన్లు అందరూ చాలా బాగా కోపరేట్ చేశారు. చిత్రం చాలా బాగా వచ్చింది మంచి విజయం అవుతుంది అనే నమ్మకం ఏర్పడింది అని అన్నారు.

ఈ చిత్రానికి కథా సహకారం ఎ. చంద్రశేఖర్. మాటలు నరేంద్ర, నరేన్ ఎల్లాప్రగడ. పాటలు అప్పల ప్రసాద్, సంగీతం ఘన శ్యామ్, ఎడిటింగ్ కళ్యాణ్ గాజా, ప్రసాద్, కెమెరా ఆనంద్ మరుకుత్తి, డాన్స్ ప్రేమ్, స్టిల్స్ శ్రీనివాస్, సహాయ దర్శకులు సర్వేశ్వర రావు, శంకర ప్రసాద్, సహ నిర్మాతలు ప్రశాంతి రవి కె. కథ మరియు నిర్మాత చండ్ర మధు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కృష్ణ తోట అందించారు.

సంబంధిత సమాచారం :