నితిన్, కీర్తి సురేష్‌ల సినిమాకు ఫీల్ గుడ్ టైటిల్

raang dhee

ప్రస్తుతం ‘భీష్మ’ చిత్రీకరణలో బిజీగా ఉన్న నితిన్ తర్వాతి సినిమాల్ని కూడా ప్లాన్ చేసి పెట్టుకుంటున్నారు. నిన్ననే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఒక సినిమాను పూజా కార్యక్రమాలతో పారంభించిన ఆయనను కొన్ని రోజుల క్రితమే వెంకీ అట్లూరి డైరక్షన్లో ఒక సినిమాకు కమిటయ్యారు. ఈ సినిమాను కొద్దిసేపటి క్రితమే అధికారికంగా అనౌన్స్ చేశారు.

ఈ చిత్రానికి ‘రంగ్‌దే’ అనే ఫీల్ గుడ్ టైటిల్ నిర్ణయించారు. ఇందులో నితిన్ సరసన స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించనుంది. తొలిసారి ఈ ఇద్దరూ జోడీగా నటిస్తుండటం సినిమాకు ప్రత్యేకతను ఆపాదించింది. ఇది కూడా వెంకీ గత చిత్రాల్లానే కంప్లీట్ లవ్ ఎంటర్టైనర్. 2020 వేసవికి విడుదలకానున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. స్టార్ సినిమాటోగ్రఫర్ పిసి శ్రీరామ్ ఈ చిత్రానికి వర్క్ చేయనున్నారు.

Exit mobile version