అడివి శేష్ “G2” లో ఫీమేల్ లీడ్ ఫిక్స్!

Published on Nov 20, 2023 4:43 pm IST

టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన గూఢచారి మూవీ ఆడియన్స్ ను విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్ ను మేకర్స్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. G2 పేరుతో సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం కి సంబందించిన ఇంపార్టెంట్ అప్డేట్ ను మేకర్స్ నేడు రివీల్ చేయడం జరిగింది. ఈ చిత్రం లో అడివి శేష్ సరసన హీరోయిన్ గా తమిళ్ వెర్షన్ అర్జున్ రెడ్డి ఫేమ్ బనితా సందు నటించనుంది. ఈ చిత్రం హీరోయిన్ టాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది.

నూతన దర్శకుడు వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న గూడాచారి 2 త్వరలో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :