మెగాస్టార్ “గాడ్ ఫాదర్” నుండి మరిన్ని వర్కింగ్ స్టిల్స్ రిలీజ్!

Published on Oct 1, 2022 12:00 am IST


మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మోహన్ రాజా దర్శకత్వం లో తెరకెక్కిన గాడ్ ఫాదర్ చిత్రం అక్టోబర్ 5, 2022 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు విడుదలై ప్రేక్షకులని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రం రిలీజ్ కి దగ్గర పడుతుండటం తో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మరింత వేగవంతం చేయడం జరిగింది. ఈ చిత్రం కి సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ ను తాజాగా విడుదల చేయడం జరిగింది. ఈ స్టిల్స్ లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మెగాస్టార్ చిరంజీవి, నయనతార లకి సంబందించిన స్టిల్స్ ను విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం లో నయనతార లేడీ లీడ్ రోల్ లో నటిస్తుంది. సత్యదేవ్, సల్మాన్ ఖాన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :