‘ఫిదా’ 10 రోజుల వసూళ్ల వివరాలు !
Published on Jul 31, 2017 12:33 pm IST


ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద భారీ విజయాల్ని సాధించిన చిత్రాల్లో ‘ఫిదా’ కూడా ఒకటి. విడుదలైన మొదటి రోజే మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం భారీ స్థాయి వసూళ్లను సాధిస్తోంది. విశేషమైన ఈ ప్రేక్షకాదరణను చూసిన నిర్మాతలు మొదటి వారంలోనే థియేటర్లను కూడా పెంచారు. దీంతో చిత్ర వసూళ్లు మరింత మెరుగ్గా సాగుతున్నాయి. నిర్మాతల లెక్కల ప్రకారం మొదటి 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 31 కోట్ల షేర్ ను నమోదు చేసిన ఈ చిత్రం రూ. 50 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.

ఇక మెగా హీరోలకి మంచి పట్టున్న నైజాం ఏరియాలో రూ. 10 కోట్లను వసూలు చేసి, ఓవర్సీస్ మార్కెట్లో 1. 6 మిలియన్ డాలర్లను క్రాస్ చేసి 2 మిలియన్ల దిశగా దూసుకుపోతోంది. మంచి కుటుంబ విలువలతో పాటు తెలంగాణా వాతావరణాన్ని నింపుకున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం వరుణ్ తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook