2 మిలియన్లు కొల్లగొట్టిన ‘ఫిదా’ !
Published on Aug 13, 2017 9:53 am IST


మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘ఫిదా’ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. లాంగ్ గ్యాప్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా వరుణ్ తేజ్ కు మంచి కమర్షియల్ బ్రేక్ ను అందించింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో వరుణ్ తేజ్ కు మార్కెట్ ను క్రియేట్ చేసింది. నిన్న శనివారం వరకు ఈ చిత్రం 2,000,159 డాలర్లను వసూలు చేసింది.

ఈ ఫీట్ తో 2 మిలియన్ డాలర్ల క్లబ్ లోకి చేరిన 7వ తెలుగు సినిమాగా ‘ఫిదా’ నిలిచింది. మొదటి ఆరు స్థానాల్లో ‘బాహుబలి-1, 2, శ్రీమంతుడు, అ ..ఆ, ఖైదీ నెం 150, నాన్నకు ప్రేమతో’ వంటి సినిమాలు ఉన్నాయి. యూఎస్ అబ్బాయి, తెలంగాణా అమ్మాయిల మధ్య నడిచే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు.

 
Like us on Facebook