మిలియన్ డాలర్ క్లబ్లోకి ‘ఫిదా’ !

25th, July 2017 - 10:07:18 AM


వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘ఫిదా’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. శేఖర్ కమ్ముల చాలా కాలం తర్వాత డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కేవలం ఏ సెంటర్ల ఆడియన్స్ మాత్రమేగాక బి, సి సెంటర్ల ప్రేక్షకుల్ని కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. ఓవర్సీస్లో అయితే తెలుగు జనాలు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. శుక్ర, శనివారాలు కలిపి 6.6 లక్షల డాలర్లను రాబట్టిన ఈ సినిమా నిన్నటితో మిలియన్ డాలర్ క్లబ్లోకి చేరిపోయింది.

ఈ సినిమాతో వరుణ్ తేజ్, సాయి పల్లవి, శేఖర్ కమ్ములకి మొదటి మిలియన్ డాలర్ సినిమా ఖాతాలో పడ్డట్లయింది. లాంగ్ రన్లో ఈ వసూళ్లు 2 మిలియన్ డాలర్ల వరకు వెళ్లే అవకాశాముందని ట్రేడ్ వర్గాలు భావియిస్తున్నాయి. ఇక సీడెడ్లో ఈ చిత్రానికి నాలుగు రోజులకి కలిపి రూ.1.40 కోట్ల షేర్ వసూలైనట్టు తెలుస్తోంది. కేరీర్లో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న తేజ్ కు ఈ చిత్రం మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి.