బన్నీతో పాటే థియేటర్లలో సందడి చేస్తున్న మరో మెగా హీరో !


అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాథమ్’ సినిమా ఈరోజే విడుదలై థియేటర్లలో హడావుడి చేస్తోంది. బన్నీతో పాటే మరొక మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ‘డీజే’ థియేటర్లలో సందడి చేస్తున్నాడు. అదెలా అంటే ఆయన నటించిన తాజా చిత్రం ‘ఫిదా’ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ఈరోజు నుండి డీజే ప్రదర్శింపబడుతున్న స్క్రీన్లలో ప్రదర్శితమవుతోంది.

అంతేగాక ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది కూడా. సినిమా పూర్తి స్థాయి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనుందని చెబుతున్న ఈ ట్రైలర్లో హీరోయిన్ సాయి పల్లవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణా యాసలో ఆమె మాటలు, స్క్రీన్ ప్రెజెన్స్ కొత్తగా ఉన్నాయి. అలాగే వరుణ్ తేజ్ క్లాస్ లుక్, డైలాగులు బాగున్నాయి. దీంతో సినిమాపై క్రేజ్ కూడా పెరుగుతోంది. ఇకపోతే ఈ ట్రైలర్ ను ఈరోజు సాయంత్రం 6 గంటలకు సోషల్ మీడియాలో విడుదల చేయనున్నారు. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు.