‘ఫిదా’ బాన్సువాడ షెడ్యూల్ పూర్తి!

fidaa
యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో కలిసి ‘ఫిదా’ అనే సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల స్టైల్లో సాగే ఈ రొమాంటిక్ కామెడీని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఇక ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నింటినీ పక్కా ప్లాన్‌తో పూర్తి చేసుకొని గత నెల్లో సెట్స్‌పైకి వెళ్ళిన ఈ సినిమా నేటితో ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.

నిజామాబాద్ జిల్లా బాన్సువాడలోని కథకు అవసరమయ్యే పలు రియలిస్టిక్ లొకేషన్స్‌లో శేఖర్ కమ్ముల ఫస్ట్ షెడ్యూల్‌ను తెరకెక్కించారు. ఈ ఫస్ట్ షెడ్యూల్ చాలా బాగా వచ్చిందని, శేఖర్ కమ్ముల అండ్ టీమ్ సినిమా కోసం బాగా కష్టపడుతున్నారని తెలుపుతూ త్వరలోనే సెకండ్ షెడ్యూల్ మొదలవుతుందని దిల్‌రాజు తెలిపారు. వరుణ్ తేజ్ సరసన ‘ప్రేమమ్’ సెన్సేషన్ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా ఓ ఎన్నారై, ఓ తెలంగాణా అమ్మాయి మధ్యన జరిగే ప్రేమకథగా ప్రచారం పొందుతోంది.