నైజాం లో కొనసాగుతున్న “పుష్పరాజ్” హావా…ఐదవ రోజు కలెక్షన్స్ ఎంతంటే?

Published on Dec 22, 2021 2:00 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సిసలైన మాస్ విశ్వరూపం చూపిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. నైజాం లో ఈ చిత్రం మరింత దూకుడు గా వ్యవహరిస్తోంది. ఐదవ రోజు ఈ చిత్రం 2.15 కోట్ల రూపాయలను సాధించడం విశేషం. మొత్తం ఇప్పటి వరకూ నైజాం లో ఈ చిత్రం 29 కోట్ల రూపాయల వరకు వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది.

రష్మిక ఈ చిత్రం లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించగా, సమంత స్పెషల్ సాంగ్ లో రెచ్చిపోయింది. మలయాళ నటుడు ఫాహద్ ఈ చిత్రం లో విలన్ పాత్ర లో నటించారు. అనసూయ భరద్వాజ్, సునీల్ ఈ చిత్రం లో కీ రోల్స్ ప్లే చేయడం జరిగింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, చంద్రబోస్ పాటలు సినిమా కి హైలైట్ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :