నేడు సినీ ప్రముఖుల సమావేశం.. సమస్యల పై చర్చ !

Published on Jul 25, 2022 11:05 am IST

సినీ ప్రముఖుల సమావేశం కాబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఫిలిం ఛాంబర్ లో సినీ ప్రముఖుల సమావేశం జరగనుంది. చిత్ర పరిశ్రమ సమస్యల పై చర్చించేందుకు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్ లో నిర్మాతలు , డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్లతో పాటు స్టూడియో సెక్టార్ సభ్యులు కూడా పాల్గొనబోతున్నారు.

ఈ సమావేశంలో ప్రముఖంగా ఓటీటీ, విపిఎఫ్ ఛార్జీలు, టిక్కెట్ ధరలు, నిర్మాణ వ్యయం వంటి విషయాలతో పాటు, షూటింగ్ పరిస్థితులు & రేట్లు, ఫైటర్స్ యూనియన్ సమస్యలు వంటి అంశాల పై కూడా చర్చించనున్నారు. అలాగే, ఫెడరేషన్ సమస్యలను, మేనేజర్ ల పాత్ర విషయం పై, అదేవిధంగా నటీనటులు / టెక్నీషియన్ల సమస్యల పై కూడా ఈ సమావేశంలో చర్చ జరపనున్నారు. అలాగే, సభ్యుల సూచనల మేరకు షూటింగ్ లపై కూడా ఛాంబర్ నిర్ణయం తీసుకోనుంది.

సంబంధిత సమాచారం :