ఫిల్మ్ ట్రివియా : పోకిరిలో మొదటి అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా ?

Published on Sep 28, 2020 8:04 pm IST

ఈ సెక్షన్ లో మేము 123తెలుగు ద్వారా మీకు తెలియని ఎన్నో ఆసక్తికర అంశాలను వెల్లడిస్తాము. నటులు, బాక్సాఫీస్, మ్యూజిక్, యాక్షన్ మేకింగ్, టెక్నిషీయన్స్ కు సంబంధించి ఇలా ఎన్నో అంశాలకు సంబంధించి ఒక ప్రశ్న అడుగుతాము.

ఈ రోజు హింట్ :

ఈరోజు మా ప్రశ్న ఏమిటంటే… మహేష్ సూపర్ హిట్ సినిమా ‘పోకిరి’లో మొదట హీరోయిన్ పాత్రలో.. మరో నటిని అనుకున్నారు. మరి ఆ నటి ఎవరు? దిగువ కామెంట్స్ విభాగంలో ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. త్వరలో సరైన సమాధానం మేమే వెల్లడిస్తాము.


సమాధానం :

సరైన సమాధానం ఏమిటంటే ఆ నటి మరెవరో కాదు స్టార్ హీరోయిన్ ‘కంగనా రనౌత్’. దర్శకుడు పూరి మొదట పోకిరి సినిమాలో కంగననే హీరోయిన్ గా పెట్టాలని నిర్ణయించుకున్నాడు, కాని కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. దాంతో పోకిరి చిత్రం కోసం ఇలియానను హీరోయిన్ గా తీసుకున్నాడు.

సంబంధిత సమాచారం :

More